బర్త్డే ముందు రోజే బాలుడి మృతి..కేక్ కట్ చేయించిన పేరెంట్స్
Adilabad: మరుసటి రోజు బర్త్డే (birthday)అనగా.. ఓ 16 ఏళ్ల బాలుడు ముందు రోజే చనిపోయిన బాధాకర ఘటన తెలంగాణలోని(telangana) ఆదిలాబాద్(adilabad) జిల్లాలో చోటుచేసుకుంది. ఆసీఫాబాద్ ప్రాంతానికి చెందిన ఓ బాలుడు గత బుధవారం కడుపులో నొప్పిగా ఉందని చెప్పాడు. దాంతో తల్లిదండ్రులు వెంటనే మంచిర్యాలలోని ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు గురువారం చనిపోయాడు. శుక్రవారం బాలుడి బర్త్డే. దాంతో పుట్టెడు దుఖంతో ఆ తల్లిదండ్రులు బిడ్డ మృతదేహం పక్కనే చెయ్యి పట్టుకుని కేక్ కట్ చేయించారు. గుండెపోటుతో బాలుడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించినప్పటికీ పోస్ట్ మార్టెం రిపోర్ట్ వస్తే ఓ క్లారిటీ వస్తుందని తెలిపారు.