Viral News: 1627లో పుట్టిన సొరచేప ఇదే.. ఇప్పటికీ బతికే ఉంది
Viral News: ప్రముఖ శాస్త్రవేత్త ఐసాక్ న్యూటన్ కంటే ముందు పుట్టిన గ్రీన్ ల్యాండ్ సొర చేప ఇది. ఆర్కిటిక్ సముద్రంలో ఇంకా సంచరిస్తూనే ఉంది. ఇది 1627లో పుట్టింది. ఇప్పుడు దీని వయసు 392 సంవత్సరాలు. ఇప్పటికీ ఇదే సముద్రంలో సంచరిస్తోందని పరిశోధకులు వెల్లడించారు. ఈ భూ మండలంలోనే అత్యంత పురాతనమైన జీవి ఇదేనట. ఇలాంటి సొరచేపలు, తిమింగళాల వయసును పరిశోధకులు రేడియో కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా తెలుసుకోగలుగుతారు. ఇలాంటి గ్రీన్ ల్యాండ్ సొరచేపల పొడవు 24 అడుగులు ఉంటుంది.