The Kerala Story: “నిర్మాతను నడిరోడ్డు మీద ఉరితీయాలి”
Hyderabad: వివాదాస్పదంగా మారిన ది కేరళ ఫైల్స్(the kerala story) సినిమా నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షాను పబ్లిక్‌లో ఉరితీయాలని తీవ్ర వ్యాఖ్యలు చేసారు ఎన్సీపీ నేత జితేంద్ర అహ్వాద్(jitendra ahwad). ప్రముఖ నటి అదా శర్మా(adah sharma) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను సుదీప్తో సేన్(sudipto sen) డైరెక్ట్ చేసారు. టెర్రరిస్ట్‌ల సంస్థ ది ఇస్లామిక్ స్టేట్.. కేరళకు చెందిన వేల మంది అమ్మాయిలను కిడ్నాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. నలుగురు యువతులు మతం మారి.. ఐసిస్‌లో చేరినట్లుగా కథ మొదలవుతుంది. దాంతో ఈ సినిమా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఈ సినిమాను అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం సినిమాలో చూపించినదంతా అసత్యాలే అంటోంది. దాంతో జితేంద్ర అహ్వాద్ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ.. సినిమా నిర్మాతను ఉరితీయాలంటూ వివాదాస్పద కామెంట్స్ చేసారు. మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ సినిమాను ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించారు. కానీ పశ్చిమ బెంగాల్‌లో మాత్రం సినిమాపై బ్యాన్ విధించారు. ఈ సినిమా దర్శకుడు బెంగాలీ కావడం గమనార్హం. దాంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సినిమా చూసి బ్యాన్ చేసినా సంతోషించేవాడినని సుదీప్తో సేన్ అన్నారు.