Imran Khan: పాక్ మాజీ ప్ర‌ధాని అరెస్టా.. కిడ్నాపా?

Islamabad: పాకిస్థాన్(pakistan) మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్(imran khan) అరెస్ట్ అయ్యారు. ఇస్లామాబాద్‌లోని ఓ కోర్టు ప్రాంగణంలో ఇమ్రాన్‌ను పోలీసులు బాడీగార్డుల‌ను కొట్టి మరీ వాహ‌నాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. దాంతో పాకిస్థాన్‌లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. ఓ దోపిడీ కేసులో భాగంగా కోర్టు హియ‌రింగ్‌కి వెళ్తుండ‌గా దాదాపు 60 మందికి పైగా పారా మిలిట‌రీ అధికారులు ఇమ్రాన్‌ను లాక్కెళ్లి వాహ‌నంలో ఎక్కించి మ‌రీ తీసుకుపోయారు. దాంతో అది ఆయ‌న అరెస్ట్‌లా లేద‌ని, కిడ్నాప్ చేసిన‌ట్లు తెలుస్తోంద‌ని ఇమ్రాన్ మ‌ద్ద‌తుదారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. సాధార‌ణంగా అరెస్ట్ చేయాలంటే కోర్టు నుంచి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత కూడా చేయొచ్చ‌ని, అలా కాకుండా ఓ మాజీ ప్ర‌ధానిని కోర్టు లోప‌లికి వెళ్లి లాక్కొచ్చి మ‌రీ అరెస్ట్ చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.