America shooting: ఐశ్వర్య ముఖమంతా బుల్లెట్లు..కేటీఆర్ సాయం కోరిన ఫ్రెండ్
Hyderabad: అమెరికాలో(america shooting) జరిగిన కాల్పుల్లో తెలుగు యువతి ఐశ్వర్య తాటికొండ(aishwarya thatikonda) ముఖమంతా బుల్లెట్ గాయాలతో నిండిపోయింది. దాంతో ఆమె మృతదేహాన్ని గుర్తుపట్టలేకపోతున్నామని.. ఆమె స్నేహితుడు సాయి వికాస్ వాపోయారు. దాంతో ఎలాగైనా ఐశ్వర్య మృతదేహాన్ని ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌లో రిక్వెస్ట్ పెట్టాడు. దాంతో వెంటనే కేటీఆర్ స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టెక్సాస్‌లోని అలెన్ మాల్‌లో శనివారం మధ్యాహ్నం ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు.
ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో తెలంగాణకు చెందిన ఐశ్వర్య ఒకరు. ఆమె తనకు కాబోయే భర్తతో కలిసి షాపింగ్ కోసమని అల్లెన్ మాల్‌కు వెళ్లారు. అక్కడే ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఐశ్వర్య అక్కడికక్కడే చనిపోగా.. ఆమెకు కాబోయే భర్తకు మూడు బుల్లెట్లు తగిలాయి. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. దుండగుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి హతమార్చారు. అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్ తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది. ఉద్యోగ రిత్యా అక్కడికి వెళ్లిన వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.