Kolkata: నదిలో నుంచి వెళ్లే మెట్రో చూసారా..!
Kolkata: పశ్చిమ బెంగాల్(west bengal) రాజధాని కలకత్తా(kolkata) రైల్వే శాఖ చరిత్ర సృష్టించింది. నది లోపలి నుంచి వెళ్లే మెట్రోను(metro) రూపొందించింది. భారతదేశంలో ఇలాంటి అండర్ రివర్ మెట్రోను(under river metro) తయారుచేసిన మొదటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మెట్రో అధికారులు, దానిని తయారుచేసిన ఇంజినీర్లు మెట్రోలో ఎక్కి ప్రయాణించి టెస్ట్ రన్ చేసారు. కలకత్తా నుంచి హుగ్లీ, హౌరా ప్రాంతాలకు ఈ టెస్ట్ రన్ చేసారు. కలకత్తా ప్రజలకు ఇదొక గొప్ప అనుభూతిని ఇస్తుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. త్వరలో ఈ అండర్ రివర్ మెట్రో సేవలను ప్రారంభించనున్నారు.
Video Player
00:00
00:00