Arjun tendulkar: స‌చిన్ కుమారుడి ఐపీఎల్ ఎంట్రీ

Mumbai: దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ తెందుల్క‌ర్(sachin tendulkar) కుమారుడు అర్జున్‌ తెందుల్క‌ర్(arjun tendulkar) ఐపీఎల్‌లో(ipl) ఎంట్రీ ఇచ్చేసాడు. ముంబై ఇండియ‌న్స్(mumbai indians), కోల్‌క‌త్తా నైట్ రైడర్స్(kolkata knight riders) మ‌ధ్య జ‌రుగుతున్న ఉత్కంఠ పోరులో అర్జున్‌కు చోటు ద‌క్కింది. అర్జున్‌కు తొలి ఓవ‌ర్‌లో బౌలింగ్ వేసే అవ‌కాశం కూడా ఇచ్చారు. ముంబై జ‌ట్టు త‌ర‌ఫున ఆడిన స‌చిన్ ఎన్నో విజ‌యాలు అందించారు. ఇప్పుడు ఆయ‌న వార‌సుడు ఏ మేర‌కు రాణిస్తాడో చూడాలి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌.. అర్జున్‌కు క్యాప్ పెట్టి వెల్కం చెప్తున్న వీడియో వైర‌ల్ అవుతోంది.