vijayawada: ఘోరం.. మురుగు కాలువలో పడి బాలుడు మృతి
vijayawada: విజయవాడలో ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం(heavy rain) కురిసింది. దాదాపు గంటకుపైగా వాన పడటంతో.. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లపై పెద్దఎత్తున నీరు వచ్చి నిలిచింది. ఈక్రమంలో విజయవాడ నగరంలోని గురునానక్ కాలనీ(gurunanak colony)కి చెందిన ఓ బాలుడు(six years boy) ఇంటి ముందు ఆడుకుంటూ.. ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు(fell into the canal) వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మున్సిపల్ సిబ్బంది, పోలీసులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి బాలుడు శవమై తేలాడు.
గురునానక్ కాలనీలో ఉంటున్న అభిరామ్(abhiram)(6) ఒకటో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం కురిసిన వర్షానికి అభిరామ్ ఇంటి వద్ద నీరు నిలిచింది. సరదాగా నీటితో ఆడుకుంటున్న బాలుడు.. అక్కడ కాలువ ఉందని గుర్తించలేదు. దీంతో పొరపాటున అందులో పడిపోయాడు. వెంటనే స్పందించిన మున్సిపల్ సిబ్బంది బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి భారతి నగర్‌లో బాలుడి మృతదేహం(abhiram died) లభించింది. పోస్టుమార్టం నిమిత్తం.. అభిరామ్ మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే.. బాలుడు చనిపోయాడని స్థానిక సీపీఎం నాయకులు బాబురావు ఆరోపించారు. ఈ ఘటనకు మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత వహించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇటీవల హైదరాబాద్‌లో కూడా మౌనిక అనే బాలిక ఇదేవిధంగా మ్యాన్ హోల్లో పడి చనిపోయింది.