summer: మండుతున్న ఎండలు… వడగాల్పుల హెచ్చరిక
vijayawada: తెలుగు రాష్ట్రాల్లో(telugu states) ఎండలు(summer) మండుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని నిర్మల్ జిల్లా(nirmal district)లో అత్యధికంగా 43, 44 డిగ్రీలకు వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఏపీలో కూడా ఎండలతోపాటు, వడగాలుల(heatwaves) తీవ్రత పెరిగింది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరకున్నాయి.
ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)తో పాటు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా బుధవారం వరకు వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలను శాస్త్రవేత్తలు జారీ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు.. రాయలసీమ ప్రాంతంలో మంగళవారం 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ(telangana)లో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. పగలు ఎండలు కొనసాగనుండగా.. రాత్రి వేళల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. ఇక నిన్న హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రీత్యా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.