MS Dhoni కాలికి గాయం..?
MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. నిన్న సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌కి (Delhi Capitals) మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీ విశ్వరూపం చూపించాడు. వరుస ఫోర్స్, సిక్సులు బాదేసాడు. ఇంకో ఓవర్ ఉండి ఉంటే గెలుపు చెన్నై సూపర్ కింగ్స్‌దే అయ్యి ఉండేది.
అయితే.. మ్యాచ్ తర్వాత ధోనీ మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యాన్స్ కోసం తన ఆటను డెడికేట్ చేస్తున్నానని చెప్పి డ్రెస్సింగ్ రూం వైపు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కుంటుతూ వెళ్లాడు. దాంతో ఆయన కాలికి గాయం అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. తర్వాత మ్యాచ్‌కి ధోనీ పూర్తిగా కోలుకుంటే ఫర్వాలేదు. లేదంటే వికెట్ కీపింగ్‌కి కూడా కష్టమే అనే టాక్ కూడా వినిపిస్తోంది.