SRH vs KKR: రైడ‌ర్స్ ర‌చ్చా? రైజ‌ర్స్ ర్యాంపా?

who will win ipl 2024 in SRH vs KKR match

SRH vs KKR: ఎట్ట‌కేల‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫైన‌ల్స్‌కు చేరుకుని.. రేపు క‌ల‌క‌త్తా నైట్ రైడర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ రెండు టీంల‌లో కీల‌క ఆట‌గాళ్లు సునీల్ న‌రైన్, ఫిల్ సాల్ట్ (క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ (స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్). దాంతో ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌డం కాస్త క‌ష్టమే. మాకేం త‌క్కువ అంటే మాకేం త‌క్కువ అనే రేంజ్‌లో ఈ రెండు జ‌ట్లు ఐపీఎల్ 2024 సీజ‌న్‌ను ఊదిపారేసాయి.

క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ స్టార్టింగ్ నుంచి స్ట్రాంగ్‌గా ఉంది. ఫైన‌ల్స్‌కు చేరుకునేందుకు ఢిల్లీ క్యాపిట‌ల్స్, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును మ‌ట్టి క‌రిపించింది. ఓపెనింగ్ పార్ట్‌న‌ర్‌షిప్‌లో సునీల్ న‌రైన్, ఫిల్ సాల్ట్ కాంబినేష‌న్ అదుర్స్. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై 272 ప‌రుగుల‌తో రికార్డు సాధించినా.. మ‌ధ్య‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్, పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మిని చ‌విచూసింది. చివ‌రి ఆరు మ్యాచ్‌ల‌లో ఐదు గెలిచి పాయింట్స్ టేబుల్‌లో టాప్ స్థానానికి చేరుకుంది. క్వాలిఫైయ‌ర్ మ్యాచ్‌లో స‌న్ రైజ‌ర్స్ స్కోర్‌ను ఛేజ్ చేసి మ‌రీ గెలిచింది.

ఇక స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ విష‌యానికొస్తే.. క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్‌తో ఆడిన మొదటి మ్యాచ్ ఓడిపోయిన‌ప్ప‌టికీ ముంబై ఇండియ‌న్స్‌పై గెలిచి పుంజుకుంది. 277 స్కోర్ చేసి ఐపీఎల్‌లోనే అత్య‌ధిక స్కోర్ సాధించిన టీంగా నిల‌వ‌డ‌మే కాదు.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై 287 ప‌రుగులు తీసి తన రికార్డును త‌నే బ్రేక్ చేసి కొత్త రికార్డు సృష్టించిన టీం స‌న్‌రైజ‌ర్స్. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌లో కీల‌క ఆట‌గాళ్లు ఎవ‌రైనా ఉన్నారంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌, హైన్రిచ్ క్లాసెన్.

సీజన్ మ‌ధ్య‌లో ప్లే ఆఫ్స్‌కి రావ‌డానికి ముందు గుజ‌రాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌ని ఓడించి మ‌రీ టాప్ స్థానానికి చేరుకుంది. తొలి క్వాలిఫైయ‌ర్‌లో కల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ చేతిలో ఓడిపోయినా రెండో క్వాలిఫైయ‌ర్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ను బీట్ చేసింది. రెండు టీంల పెర్ఫామెన్స్ రికార్డ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. అందుకే రేపు జ‌ర‌గ‌బోయే ఫైనల్ మ్యాచ్‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.