Duleep Trophy: కోహ్లీ రోహిత్‌ని పక్కనపెట్టిన BCCI .. నలుగురు కెప్టెన్లు వీరే
Duleep Trophy: 2024 నుంచి 2025 మధ్య జరగబోయే దులీప్ ట్రోఫీకి BCCI విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను పక్కనపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో, ఆ తర్వాత బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సెప్టెంబర్ 5 నుంచి ఈ దులీప్ ట్రోఫీ జరగనుంది. తొలి రౌండ్‌లో రోహిత్ శర్మను
కానీ విరాట్ కోహ్లీని కానీ BCCI ప్రకటించలేదు. వీరిద్దరే కాదు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్‌లకు చోటు దక్కింది. జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌లకు కూడా అవకాశం దక్కలేదు. ఈ ట్రోఫీలో ఆడేందుకు ఇషాన్ కిషన్‌కు అవకాశం దక్కింది. ఈ ట్రోఫీలో మొత్తం ఏ, బి, సి, డి టీమ్స్ ఉన్నాయి. టీమ్స్‌కు కెప్టెన్లుగా శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్‌లు నియమితులయ్యారు. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో పాల్గొనే క్రికెటర్లను దులీప్ ట్రోఫీలో నియమించినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ దులీప్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి పాల్గొంటాడా లేదా అనేది ఫిట్నెస్ విషయంలో ఆధారపడి ఉంటుంది.