IPL 2024: బెస్ట్ టీం ఏది?

IPL 2024: భార‌త‌దేశంలోనే అతిపెద్ద క్రికెట్ ఫెస్టివ‌ల్ అయిన ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ 17వ సీజ‌న్ మొద‌లైపోయింది. మొన్న 22న ప్రారంభమైన IPLలో బెస్ట్ టీం ఏదో తెలుసుకుందాం. ఓ జాతీయ మీడియా ప్ర‌కటించిన‌ నివేదిక ప్ర‌కారం అన్ని టీంల‌లో ది బెస్ట్ ఏది అంటే అది ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) అని తేలింది. ముంబై ఇండియ‌న్స్ టీం విలువ 87 మిలియ‌న్ డాల‌ర్లు. ఆ త‌ర్వాత స్థానంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) 81 మిలియ‌న్ డాల‌ర్ల వ్యాల్యుయేష‌న్‌తో ఉంది.

ముంబై ఇండియ‌న్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ టీంలు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాయి. ఇక రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ (Kolkata Knight Riders) 79 మిలియ‌న్ డాల‌ర్ల‌తో మూడో స్థానంలో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ చ‌రిత్ర‌లో ఒక్క‌సారి కూడా టైటిల్ గెల‌వ‌ని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరులో (Royal Challengers Banglore) నాలుగో స్థానంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. RCB విలువ 48 మిలియ‌న్ డాల‌ర్లు.

MI – 87 మిలియ‌న్ డాల‌ర్లు
CSK –  81 మిలియ‌న్ డాల‌ర్లు
KKR –  79 మిలియ‌న్ డాల‌ర్లు
RCB –  70 మిలియ‌న్ డాల‌ర్లు
GT –  65 మిలియ‌న్ డాల‌ర్లు
DC –  64 మిలియ‌న్ డాల‌ర్లు
RR –  63 మిలియ‌న్ డాల‌ర్లు
SRH –  48 మిలియ‌న్ డాల‌ర్లు
LSG –  47 మిలియ‌న్ డాల‌ర్లు
PBKS –  45 మిలియ‌న్ డాల‌ర్లు