SRH vs RR: మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం అయితే ఏంటి ప‌రిస్థితి?

what if rain interrupts SRH vs RR match

SRH vs RR: కల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్‌తో ఫైన‌ల్ మ్యాచ్ ఆడేది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాదా.. లేక రాజ‌స్థాన్ రాయ‌ల్సా అని ఈరోజు తేలిపోతుంది. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. అయితే ఈరోజు వ‌ర్షం పడితే మ్యాచ్ ప‌రిస్థితి ఏంటో.. ఎవ‌రు ఫైన‌ల్స్‌కి వెళ్లే అవ‌కాశం ఉంటుందో చూద్దాం.

చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అయితే చెన్నైలో వ‌ర్షం ప‌డే సూచ‌న‌లు స్వ‌ల్పంగా ఉన్నాయి. మ్యాచ్ స‌మ‌యంలో 1 నుంచి 2 శాతం వ‌ర‌కు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది. ఇక అర్థ‌రాత్రి ప‌డే అవ‌కాశం 6 శాతం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఒక‌వేళ మ‌న క‌ర్మ కాలి మ్యాచ స‌మ‌యంలో వ‌ర్షం ప‌డితే మ్యాచ్ పూర్త‌వ‌డానికి అద‌నంగా 120 నిమిషాల స‌మ‌యం ఉంటుంది.

ఈ మ్యాచ్ కోసం అద‌నంగా మ‌రో రోజుకు షెడ్యూల్ చేసే అవ‌కాశం లేదు. ఒక‌వేళ ఎంత‌కీ వ‌ర్షం ఆగ‌క‌పోతే మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఏ టీం ఎక్కువ పాయింట్స్‌తో ఉందో ఆ టీమే ఫైనల్స్‌కు వెళ్తుంది. ఒక‌వేళ మ్యాచ్ టై ప‌డినా లేదా రిజ‌ల్ట్ లేక‌పోయినా సూపర్ ఓవ‌ర్ విజేత‌ను డిసైడ్ చేస్తుంది.