Virender Sehwag: ఇండియా పాకిస్థాన్ ఒక గ్రూప్‌లో వ‌ద్దు

Virender Sehwag suggested that ICC might need to rethink their strategy of grouping India and Pakistan together

Virender Sehwag: ఇక ICC ఇండియాను పాకిస్థాన్‌ను ఒక గ్రూప్‌లో చేర్చి ఆడించ‌కూడ‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు వీరేంద్ర సెహ్వాగ్. ఓపెనింగ్ మ్యాచ్‌లోనే కొత్త టీం అయిన అమెరికాతో ఆడి ఓడిపోయింది పాకిస్థాన్. ఆ త‌ర్వాత అమెరికా ఐర్లాండ్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్‌లో ఒక‌వేళ ఐర్లాండ్ గెలిచి ఉంటే పాకిస్థాన్ ముందుకు వెళ్లే ప‌రిస్థితి ఉండేది. కానీ వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు అయ్యింది. దాంతో అమెరికాకు త‌ర్వాతి స్టేజ్‌లో ఆడే అవ‌కాశం ల‌భించింది. ఫ‌లితంగా పాకిస్థాన్ ఇంటి బాట ప‌ట్టింది.

దీనిపై సెహ్వాగ్ స్పందిస్తూ.. త‌న అభిప్రాయంలో పాకిస్థాన్ వ‌ర్షం కార‌ణంగా ఓడిపోలేద‌ని.. చేత‌కాని త‌నం వ‌ల్ల ఓడిపోయింద‌ని అన్నారు. భార‌త్ చేసిన అతి త‌క్కువ స్కోర్‌ను చేజ్ చేయ‌లేక‌పోయిన పాకిస్థాన్.. కొత్త‌గా వ‌చ్చిన అమెరికాను కూడా ఓడించ‌లేక‌పోయిందంటే ఆ టీం ఎంత వీక్‌గా ఉందో అర్థ‌మ‌వుతోంద‌ని అన్నారు. ఇక‌పై ICC పాకిస్థాన్ ఇండియా మ్యాచ్‌ను టోర్న‌మెంట్ మొద‌లైన మొద‌ట్లోనే గ్రూపింగ్ చేయ‌కుండా ఉంటే బాగుంటుంద‌ని.. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ముందే ఆ టీంల చేత ఆడించేస్తే త్వ‌ర‌గా ఎలిమినేట్ అయ్యే ప‌రిస్థితి ఉంటుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.