Virender Sehwag: రోహిత్ ఉన్నా వరుసగా 5సార్లు ఓడిపోయారు
Virender Sehwag: ఈసారి ఐపీఎల్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఉన్న టాపిక్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్సీ. గతేడాది IPL వరకు రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్‌గా ఉన్నాడు. ఈసారి మాత్రం ముంబై ఇండియన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రోహిత్‌ను పక్కన పెట్టి గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యకు (Hardik Pandya) కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
పాపం హార్దిక్ ఏ ముహూర్తాన ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్ అయ్యాడో కానీ ఇప్పటివరకు ఆడిన ఏ మ్యాచ్‌నూ గెలిపించలేకపోయాడు. హార్దిక్ ఒక్కడు బాగా ఆడి టీంలోని ఇతర ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోయినా కూడా కెప్టెన్ హార్దికే కాబట్టి అతనికే చీవాట్లు పడతాయి. హార్దిక్ కెప్టెన్‌గా ఉండటం వల్లే ముంబై ఇండియన్స్ గెలవలేకపోతోందని.. రోహిత్ ఉంటే అన్నీ గెలిచేవారన్న టాక్ వినిపిస్తోంది. దీనిపై మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ స్పందించారు. హార్దిక్ కెప్టెన్‌గా ఉండటం వల్లే టీం ఓడిపోతోందని అనడానికి లేదని.. గతంలో రోహిత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు వరుసగా 5 మ్యాచ్‌లు ఓడిపోయారని విమర్శించారు.
ALSO READ: Hardik Pandya: “బాగా ఆడు..లేదా వెళ్లిపో..”
ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్‌లు ఓడిపోయింది కాబట్టి.. యాజమాన్యం కూడా మరో రెండు మ్యాచ్‌ల వరకు ఓపికపడుతుందని.. ఆ తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయమే తీసుకుంటుందని తెలిపారు. “” గతంలో పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇదే పని చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా ఉన్నప్పుడు మళ్లీ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఐపీఎల్ మధ్యలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని మళ్లీ మారుస్తుందని అనుకోవడం లేదు. అలా చేస్తే టీంకు రాంగ్ సందేశం ఇచ్చినట్లు అవుతుంది. 7 ఆటల తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుంటే బాగుంటుంది “” అని అభిప్రాయపడ్డారు సెహ్వాగ్.