Virat Kohli: నా బ్యాట్ ఎలా విరగ్గొట్టావ్.. రింకూ సింగ్‌పై కోహ్లీ ఫైర్.. !

Virat Kohli:  విరాట్ కోహ్లీ.. కల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ (Kolkata Knight Riders) ఆట‌గాడు రింకూ సింగ్ (Rinku Singh) మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిన్న క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (Royal Challengers Banglore) మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఒక్క ప‌రుగు తేడాతో క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ (KKR vs RCB) గెలిచింది. కోహ్లీ మ్యాచ్ గెల‌వ‌లేద‌న్న కోపంలో ఉన్నాడు. ఆ త‌ర్వాత డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ల‌గా.. అక్క‌డే ఉన్న రింకూ సింగ్ కోహ్లీ త‌న‌కు ఇచ్చిన బ్యాట్ విరిగిపోయింద‌ని చెప్పాడు. దాంతో ఆ బ్యాట్ ఎలా విర‌గ్గొట్టావ్ అంటూ కోహ్లీ రింకూ మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది.

ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ఇలా జ‌రిగింది

రింకూ సింగ్ : మ్యాచ్ చివ‌ర్లో నువ్వు ఇచ్చిన బ్యాట్ విరిగిపోయింది విరాట్ భాయ్

విరాట్ కోహ్లీ : నా బ్యాటా?

రింకూ సింగ్ : అవును

విరాట్ కోహ్లీ : ఎలా విరిగింది?

రింకూ సింగ్ : మ‌ధ్య‌లో నుంచి

విరాట్ కోహ్లీ : దానికి న‌న్నేం చేయ‌మంటావ్?

రింకూ సింగ్ : ఏం లేదు. జ‌స్ట్ నీకు చెప్తున్నా అంతే

విరాట్ కోహ్లీ : స‌ర్లే. అయినా ఇది నాకు చెప్పాల్సిన విష‌యం ఏమీ కాదు

ఆ త‌ర్వాత రింకూ అదే బ్యాట్ ప‌ట్టుకుని బాల్‌ను కొడుతూ ఉన్నాడు.. అది చూసిన విరాట్ ఇలా అన్నాడు

విరాట్ కోహ్లీ : ఆ బ్యాట్ బాలేదు.

రింకూ సింగ్ : ఇంకోటి ఇస్తావా?

విరాట్ కోహ్లీ : ఎవ‌రికి?

రింకూ సింగ్ : స‌రే అయితే నువ్వే ఉంచుకో నీ బ్యాట్

విరాట్ కోహ్లీ : నువ్వు ముందు నా బ్యాట్ తీసుకున్నావ్. ఇప్పుడు ఇంకో బ్యాట్ కావాలి అంటున్నావ్. నీ వ‌ల్ల నేను స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నాను

ఈ సంభాష‌ణ త‌ర్వాత మ‌ళ్లీ కోహ్లీ రింకూ సింగ్‌కి త‌న బ్యాట్ ఇస్తాడో లేదో చూడాలి. ఆదివారం మ‌ళ్లీ ఈ రెండు టీమ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి.

ALSO READ:

Suresh Raina: పార్టీలు చేసుకుంటే ఎలా గెలుస్తారు?

KL Rahul: నాకు RCB త‌ర‌ఫున ఆడాల‌ని ఉంది