ధోనీకి స్లో బాల్ చాలు.. విరాట్ కామెంట్.. ధోనీ అసహనం
RCB vs CSK: మొన్న జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో RCB ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరింది. మ్యాచ్ ఓడిపోవడంతో ఎంఎస్ ధోనీ చాలా బాధపడ్డారు. అయితే మ్యాచ్ సమయంలో కోహ్లీ.. ధోనీపై ఓ కామెంట్ చేసారు. యష్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా.. విరాట్ యష్‌కి ఒక మాట చెప్పాడు. యష్.. ధోనీకి యోర్కర్ వేయకు. స్లో బాల్ చాలు అన్నాడు. అది ధోనీ విన్నాడు. దాంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆ తర్వాత యష్ వేసిన స్లో బాల్కి ధోనీ అవుటయ్యాడు. అలా కోపంతో బ్యాటును పిచ్‌పై గట్టిగా కొట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటన మ్యాచ్ సమయంలో చర్చనీయాంశంగా మారింది.