Ambati Rayudu: CSK ఒక ట్రోఫీ RCBకి ఇస్తే బాగుంటుంది

varun aaron shuts ambati rayudu comment in style

Ambati Rayudu: చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై చేసిన కామెంట్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మొన్న జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చిత్తుగా ఓడించింది. ఆ స‌మ‌యంలో అంబ‌టి రాయుడుతో పాటు మాజీ క్రికెట‌ర్ వ‌రుణ్ ఆరోన్ త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. ఆ స‌మ‌యంలో అంబ‌టి రాయుడు ఒక కామెంట్ చేసాడు.

చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌మ వ‌ద్ద ఉన్న ట్రోఫీల‌లో ఒక ట్రోఫీ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ఇస్తే గ్రౌండ్ అంతా సంబ‌రాలు చేసుకుంటూ తిరుగుతారు అన్నాడు. దాంతో వ‌రుణ్ ఆరోన్‌కి ఒళ్లు మండింది. వెంట‌నే అంబ‌టికి కౌంట‌ర్ ఇస్తూ.. బెంగ‌ళూరు చేతిలో చెన్నై ఓడిపోయింద‌ని రాయుడు జీర్ణించుకోలేక ఇలా మాట్లాడుతున్నాడు అని రిప్లై ఇచ్చాడు.