Suryakumar Yadav: అస‌లు క్యాచ్ ప‌ట్టుకోవాల‌నుకోలేదు

Suryakumar Yadav says he will never forget catching incident in his entire lifetime

Suryakumar Yadav:  మొన్న జ‌రిగిన టీ20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ ప‌ట్టిన క్యాచ్ క్రికెట్ అభిమానుల‌కు ఇప్ప‌టికీ మైండ్ నుంచి పోయి ఉండ‌దు. మ‌రి ఆ క్యాచ్‌కి ఉన్న వ్యాల్యూ అలాంటిది. ఈ క్యాచ్‌ను టీవీల్లో వీక్షించిన మ‌న‌కే ఇలా ఉంటే.. ఇక దానిని ప‌ట్టిన సూర్య‌కు ఎలా ఉంటుంది చెప్పండి? దీని గురించి సూర్య మీడియాతో మాట్లాడుతూ.. ఆ ఐదు నుంచి ఏడు క్ష‌ణాల‌ను త‌న జీవితంలో ఎప్ప‌టికీ మర్చిపోలేన‌ని అన్నాడు. త‌న‌కు బాల్ క‌నిపించ‌లేద‌ని.. జారిపోతున్న ప్ర‌పంచ క‌ప్ మాత్ర‌మే క‌నిపించ‌ద‌ని అన్నాడు. బాల్‌ను క‌ప్‌గా ఫీలై ప‌ట్టుకున్నాన‌ని త‌న అనుభ‌వాన్ని పంచుకున్నాడు. అస‌లు తాను బాల్ క్యాచ్ ప‌ట్టుకోవాల‌ని అనుకోలేద‌ని క‌నీసం వెస్టిండీస్‌కి మూడు ర‌న్స్ మిగిల్చాల‌నే చూసాన‌ని అన్నాడు. బాల్ క్యాచ్ ప‌ట్టాలా వ‌ద్దా అని నిర్ణ‌యించుకోవ‌డానికి త‌న‌కు 7 సెక‌న్లు ప‌ట్టిందని.. ఆ 7 సెకన్ల‌ను మాత్రం జీవితంలో మ‌ర్చిపోలేన‌ని అన్నాడు.