సూర్య‌కుమార్ క్యాచ్‌లో మోసం లేదు.. ద‌క్షిణాఫ్రికా లెజెండ్ మ‌ద్ద‌తు

South African cricket legend Shaun Pollock stated that surya's catch was legal

Suryakumar Yadav: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టీమిండియాకు ద‌క్క‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో సూర్య‌కుమార్ యాద‌వ్ ప‌ట్టుకున్న క్యాచ్ ఒక‌టి. ఆ క్యాచ్ చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా ఉంది. ఆ క్యాచ్ వల్లే ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్ డేవిడ్ మిల్ల‌ర్ ఔట‌య్యాడు. అయితే సూర్య క్యాచ్ ప‌ట్టే స‌మ‌యంలో బౌండ‌రీ వ‌ద్ద ఉన్న రోప్‌ను కాస్త జ‌రిపార‌ని కొంద‌రు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోను కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేసారు. దీనిపై ద‌క్షిణాఫ్రికా క్రికెట్ లెజెండ్ షాన‌న్ పోల్లోక్ స్పందించారు. సూర్య క్యాచ్ పట్ట‌డంలో ఎలాంటి పొర‌పాటు మోసం జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. కాక‌పోతే ఆ బౌండ‌రీ రోప్ మ్యాచ్ ఆడుతున్న స‌మ‌యంలోనే ప‌క్క‌కు జ‌రిగింద‌ని.. దానికి సూర్య క్యాచ్‌కి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసారు. ఫైన‌ల్స్‌లో టీమిండియా చేతిలో కేవ‌లం 7 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే.