Rohit Sharma: అందుకే MI ఓడిపోతోందేమో

Rohit Sharma: ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) కెప్టెన్సీ నుంచి త‌ప్పించాక మొద‌టిసారి ఈ అంశంపై రోహిత్ శ‌ర్మ స్పందించారు. ఒక టీం కొన్నేళ్ల పాటు బాగా ఆడుతూ వ‌స్తోందంటే అందుకు కార‌ణం ఒకే కెప్టెన్ కంటిన్యూ అవుతూ రావ‌డ‌మే అని.. ఆ కెప్టెన్‌కు అంతా అల‌వాటు ప‌డిపోయి ఉంటార‌ని రోహిత్ అన్నారు. ఇప్పుడు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్ ఆడిన ఆట‌ల్లో రెండు మాత్ర‌మే గెలిచింది. దాంతో టీం చివ‌రి వ‌ర‌కు ఉంటుందో లేదో అనే చ‌ర్చ మొద‌లైంది. స‌డెన్‌గా టీం ఎందుకు మ్యాచ్‌ల‌లో ఓడిపోతోందో రోహిత్ వెల్ల‌డించాడు.

టీం కొన్నేళ్ల పాటు ఒకే కెప్టెన్‌కు అల‌వాటు ప‌డ్డార‌ని.. ఇప్పుడు కొత్త కెప్టెన్ రావ‌డంతో అడ్జ‌స్ట్ అవ్వ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు. త‌నకు వాంఖెడె స్టేడియం బాగా అల‌వాట‌ని.. అలాంటిది వేరే స్టేడియంలో ఆడేట‌ప్పుడు కాస్త ఇబ్బంది ఉంటుంద‌ని.. అదే విధంగా టీంలోని వారికి కూడా ఒక కెప్టెన్ అల‌వాట‌య్యి మ‌రో కెప్టెన్ వ‌స్తే అందుకు అడ్జ‌స్ట్ అవ్వ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు.

ALSO READ

ఇక నావ‌ల్ల కాదు.. హార్దిక్‌ను ఏమీ అనొద్దు

Hardik Pandya గాయాన్ని దాస్తున్నాడు… మాజీ క్రికెట‌ర్ షాకింగ్ వ్యాఖ్య‌లు