Rohit Sharma: కీరన్ పోలార్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన హిట్ మ్యాన్
Rohit Sharma: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. కీరన్ పోలార్డ్ (Kieron Pollard) రికార్డు బ్రేక్ చేసి ఐపీఎల్లో టాప్ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈరోజు జరుగుతున్న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (MI vs RCB) మ్యాచ్ సమయంలో ఇది రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తరఫున ఆడుతున్న 212వ మ్యాచ్. ఒకే టీం నుంచి అత్యధిక IPL మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడిగా నిన్నటి వరకు కీరన్ పోలార్డ్ పేరుంది. ఇప్పుడు ఆ రికార్డును రోహిత్ శర్మ తిరగరాసాడు. వెస్ట్ ఇండీస్ లెజెండ్ అయిన కీరన్ పోలార్డ్ 211 మ్యాచ్లు మాత్రమే ఆడారు.
ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడినవారు వీరే
రోహిత్ శర్మ – 212
కీరన్ పోలార్డ్ – 211
హర్భజన్ సింగ్ – 158
లసిత్ మలింగ – 139
అంబటి రాయుడు – 136