RR vs DC: రికార్డు సృష్టించనున్న రిషబ్‌ పంత్‌

RR vs DC: ఐపీఎల్‌ 2024లో భాగంగా జైపూర్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో (Rajasthan Royals) ఇవాళ జరగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) కెప్టెన్ రిషబ్‌ పంత్‌ రికార్డు సృష్టించనున్నాడు. ఈ మ్యాచ్‌తో ఢిల్లీ తరఫున 100 మ్యాచ్‌ల మైలురాయిని తాకనున్న పంత్‌.. ఐపీఎల్‌ చరిత్రలో ఈ ఫ్రాంచైజీ తరఫున 100 మ్యాచ్‌ల మైలురాయిని తాకనున్న తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 99 మ్యాచ్‌లు ఆడిన పంత్‌.. సెంచరీ, 15 హాఫ్‌ సెంచరీల సాయంతో 2856 పరుగులు చేసి, ఢిల్లీ తరఫున లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు.

హెడ్ ​​టు హెడ్

ఇవాళ రాజస్థాన్ రాయల్స్ (RR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య బి బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ LSGపై విజయంతో తమ ఖాతాను ప్రారంభించగా, ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి గేమ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇరు జట్లు ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్ 14, ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌లు గెలిచాయి.