అందుకే అఫ్ఘానిస్థాన్ భార‌త్‌ను ఓడించ‌లేక‌పోతోంది.. పాకిస్థానీ జ‌ర్న‌లిస్ట్ షాకింగ్ కామెంట్.. అశ్విన్ ఫైర్

Ravichandran Ashwin slams elon musk for the tweets appearing on his timeline

Ravichandran Ashwin: ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా అఫ్ఘానిస్థాన్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఇది చాలా మందికి షాకింగ్ అంశంగా మారింది. అఫ్ఘానిస్థాన్ త‌న ఆట‌తీరును మెరుగుప‌రుచుకుంటోంద‌ని ఆ దేశ వాసులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. ఓ పాకిస్థానీ జ‌ర్న‌లిస్ట్ అఫ్ఘానిస్థాన్ ఇండియాను ఓడించ‌లేక‌పోవ‌డంపై షాకింగ్ కామెంట్ చేసారు.

IPL కాంట్రాక్ట్‌లో భాగంగానే అఫ్ఘాన్ ఇండియాను ఓడించ‌లేక‌పోతోంద‌ని ఆ కామెంట్ సారాంశం. దీనిపై క్రికెట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ స్పందించారు.  ఇలాంటి దిక్కుమాలిన ట్వీట్స్ త‌న టైంలైన్‌లో ఎందుకు వ‌స్తున్నాయ‌ని ట్విట‌ర్ య‌జ‌మాని ఎలాన్ మ‌స్క్‌ను ట్యాగ్ చేసారు. తాను ఫాలో అయ్యేవారి ట్వీట్లే త‌న టైంలైన్‌లో రావాలి కానీ ముక్కూ మొహం తెలీని వాళ్ల ట్వీట్స్ త‌న‌కెందుకు అని మండిప‌డ్డారు. ఇక టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విషయానికొస్తే.. ఆల్రెడీ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను మ‌ట్టిక‌రిపించిన అఫ్ఘాన్.. త‌ర్వాత బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.