Ravichandran Ashwin: అసలు ఐపీఎల్ కూడా ఒక క్రికెటేనా?
Ravichandran Ashwin: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసారు క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. అసలు IPL కూడా ఒక క్రికెటేనా అని ప్రశ్నించారు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయిందని.. ఎంత ఫేమస్ అయిందంటే.. ఆట మానేసి క్రికెటర్ల చేత ప్రాక్టీస్, ట్రైనింగ్ కాకుండా యాడ్స్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చిందని అన్నారు. ఈ ఐపీఎల్ వల్ల అసలైన క్రికెట్ ఆట వెనక్కు వెళ్లిపోయిందని అభిప్రాయపడ్డారు. 37 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన తన కెరీర్‌లో 500 టెస్ట్ వికెట్లు తీసారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించిన అశ్విన్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ టీంలో కీలక ఆటగాడిగా ఉన్నాడు.
“” నేను చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్నప్పుడు నా తోటి ఆటగాడు స్కాట్ స్టైరిస్ నేను చర్చించుకున్న విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. స్టైరిస్ డెక్కర్ చార్జర్స్‌తో ఆడుతున్నప్పుడు ఐపీఎల్ సీజన్ రెండు మూడేళ్లకు మించి ఉండదని అన్నాడు. కానీ ఇంత ఫేమస్ అవుతుందని అస్సలు ఊహించలేకపోయాం “” అని తెలిపారు.