Hardik Natasha Divorce: కృణాల్ పాండ్య పోస్ట్‌పై న‌టాషా కామెంట్

natasha stankovic reacts on krunal pandya post

Hardik Natasha Divorce: క్రికెట‌ర్ హార్దిక్ పాండ్య‌.. త‌న భార్య న‌టాషాతో విడిపోతున్న‌ట్లు ఎప్ప‌టినుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఇద్ద‌రూ కామెంట్ చేయ‌ద‌ల‌చుకోలేదు కాబ‌ట్టి ఇక విడిపోతున్నార‌ని 100 శాతం క్లారిటీ వ‌చ్చేసింది. ఈ నేప‌థ్యంలో హార్దిక్ సోద‌రుడు.. క్రికెట‌ర్ కృణాల్ పాండ్య చేసిన పోస్ట్‌పై న‌టాషా కామెంట్ చేసారు. కృణాల్ త‌న కుమారుడిని.. హార్దిక్ కుమారుడిని ఎత్తుకుని దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఆ ఫోటోపై ల‌వ్లీ ఎమోజీతో న‌టాషా రియాక్ట్ అయ్యారు. సాధార‌ణంగా ఒక జంట విడిపోతున్న‌ట్లు వారి ఇంట్లో వాళ్ల‌కు సంబంధించిన ఎలాంటి పోస్ట్‌ల‌పై స్పందించ‌రు. మ‌రి ఇప్పుడు న‌టాషా స్పందించింది అంటే దాని అర్థం ఏంటో వారిద్ద‌రూ క‌న్ఫామ్ చేస్తే కానీ ఫ్యాన్స్‌కి ఓ క్లారిటీ వ‌చ్చేలా లేదు.