Michael Vaughan: RCB ఓట‌మికి అదే కీల‌కం

Michael Vaughan reveals the reason behind rcb loss in eliminator match

Michael Vaughan:  నిన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌ధ్య జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో బెంగ‌ళూరు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాంతో ఈసారి కూడా బెంగ‌ళూరు ఐపీఎల్ క‌ప్పు కొట్ట‌లేక‌పోయింది. అయితే బెంగ‌ళూరు టీం ఓడిపోవ‌డానికి కీల‌క కార‌ణం ఏంటో వివ‌రించాడు ప్ర‌ముఖ ఇంగ్లాండ్ క్రికెట‌ర్ మైఖెల్ వోగ‌న్.

బెంగ‌ళూరు టీంకు బౌలింగ్ స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. ఐపీఎల్ మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి బెంగ‌ళూరు టీం బౌలింగ్ విష‌యంలో త‌డ‌బ‌డుతూనే ఉంద‌ని అన్నారు. ఆ ఒక్క బౌలింగ్ విష‌యంలో మార్పుల చేసుకుంటే 2025లో బెంగ‌ళూరు క‌చ్చితంగా క‌ప్పు గెలుస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. బెంగ‌ళూరు మ్యాచ్ ఓడిపోయిన‌ప్ప‌టికీ కింగ్ విరాట్ కోహ్లీ మాత్రం ఫ్యాన్స్‌కి గుర్తుండిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఈసారి సీజ‌న్‌లో టాప్ స్కోర్ సాధించిన ఆట‌గాడిగా మ‌రోసారి ఆరెంజ్ క్యాప్ తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. 15 మ్యాచ్‌ల‌లో విరాట్ మొత్తం 741 ప‌రుగులు తీయ‌గా.. ఒక సెంచ‌రీ ఐదు అర్థ సెంచ‌రీలు బాదాడు.