Tanzim Sakib: రోహిత్ శ‌ర్మ‌ను ఔట్ చేయ‌లేవ్ అన్నారు..చేసి చూపించా

Many people told Tanzim that he was too new to bowl against an experienced batter like Rohit Sharma

Tanzim Sakib: 2023 ఆసియా క‌ప్ స‌మ‌యంలో బంగ్లాదేశ్ త‌ర‌ఫున టాన్జిమ్ స‌కీబ్ అంత‌ర్జాతీయ క్రికెట్ డెబ్యూ జ‌రిగింది. తొలి ఓవ‌ర్‌లోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను సునాయాసంగా అవుట్ చేసేసాడు స‌కీబ్. ఏ ర‌న్స్ చేయ‌కుండా స‌కీబ్ చేతుల్లో రోహిత్ అవుట్ అవ‌డం షాకింగ్ విష‌యం. ఆ త‌ర్వాత తిల‌క్ వ‌ర్మ వికెట్‌ను కూడా తీసాడు. కొలంబియాలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

అయితే మ్యాచ్ మొద‌ల‌వ‌డానికి ముందే రోహిత్ శ‌ర్మ లాంటి క్రికెట‌ర్‌ని ఓడించ‌లేవ్‌ని స‌కీబ్‌తో చాలా మంది అన్నార‌ట‌. ఆ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లున్నాడు. అందుకే తొలి ఓవ‌ర్‌లోనే స‌కీబ్ రోహిత్‌ను అవుట్ చేసేసాడు.  “” నేను రోహిత్ వికెట్ తీయ‌లేను అన్నారు. తీసి చూపించా. నా బౌలింగ్ బాగుంటే ఎదురుగా ఏ బ్యాట‌ర్ ఉన్నా నాకు భ‌యం లేదు. బాల్ బాగుంటే ఏ బ్యాట‌ర్‌కైనా భ‌య‌మే. వాళ్లు నెంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్ అయినా డొమెస్టిక్ ప్లేయ‌ర్ అయినా భ‌య‌ప‌డాల్సిందే “” అని సకీబ్ ఈ విష‌యాన్ని గ‌ర్వంగా మీడియా ద్వారా వెల్ల‌డించ‌డం వైర‌ల్‌గా మారింది. T20 వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌యంలో స‌కీబ్ పెర్ఫామెన్స్ చూసి బంగ్లాదేశ్ T20 స్క్వాడ్‌లో రెగ్యుల‌ర్ స్థానాన్ని క‌ల్పించారు. ఇప్పుడు T20 మూడు రోజుల సిరీస్‌లోనూ స‌కీబ్ ఉన్నాడు.