“టీ20కి గిల్ ఎందుకు.. ఏం ఆడుతున్నాడని”
టీ20 వరల్డ్ కప్ స్వ్కాడ్‌లో శుభ్‌మన్ గిల్ రిజర్వ్ స్థానాన్ని దక్కించుకోవడంపై మండిపడ్డారు మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. అసలు గిల్ ఆటతీరు బాగుండటం లేదని.. ఫాంలో లేని ఆటగాడిని వరల్డ్ కప్‌కి ఎలా నియమించారని బీసీసీఐపై మండిపడ్డారు. రుతురాజ్ గైక్వాడ్‌కు దక్కాల్సిన స్థానాన్ని గిల్‌కి ఇచ్చారని.. గిన్ సరిగ్గా ఆడకపోయినా, టెస్టుల్లో ఓడిపోయినా కూడా బీసీసీఐ అతన్ని అన్ని రకాల ఆటలకు ఎంపికచేస్తోందని మండిపడ్డారు.
“” గైక్వాడ్‌కి దక్కాల్సిన స్థానం గిల్‌కి ఎలా దక్కింది. గిల్ పట్ల బీసీసీఐ ఫేవరేటిజంని ప్రదర్శిస్తోంది. ఆడకపోయినా అన్నింట్లో అవకాశం ఇస్తోంది. రుతురాజ్ గైక్వాడ్ 17 ఇన్నింగ్స్‌లో 500 పరుగులు తీసాడు. అతనికి కదా అవకాశం ఇవ్వాల్సింది? “” అని ప్రశ్నించారు శ్రీకాంత్