Kieron Pollard: ఇక నావల్ల కాదు.. హార్దిక్‌ను ఏమీ అనొద్దు
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పోలార్డ్ అసహనం వ్యక్తం చేసారు. నిన్న ముంబై ఇండియన్స్‌కి (Mumbai Indians) చెన్నై సూపర్ కింగ్స్‌కి (Chennai Super Kings) మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. హార్దిక్ కెప్టెన్సీ, బౌలింగ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను (Rohit Sharma) పక్కన పెట్టి హార్దిక్ పాండ్యకు (Hardik Pandya) కట్టబెట్టారని ఇప్పటికే హార్దిక్‌కు శాపనార్ధాలు పెడుతున్నారు. నిన్న మ్యాచ్ ఓడిపోవడంతో ఆ విమర్శలు తారాస్థాయికి చేరాయి.
దీనిపై కీరన్ పోలార్డ్ స్పందించారు. “” ఇక నా వల్ల కాదు. విసిగిపోయాను. ఎన్నిసార్లు చెప్పాలి ఆటను ఆటలా చూడండి.. ఏ క్రికెటర్‌నూ వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు అని. హార్దిక్ పాండ్య తన ఆటతీరును ఎలా మెరుగుపరుచుకోవాలా అని చాలా ప్రయత్నిస్తున్నాడు. అతను పడే కష్టం నేను కళ్లారా చూస్తున్నాను. అది ఎందుకు అర్థంచేసుకోరు మీరు? ఎవరూ గేమ్‌లో కావాలని ఓడిపోవాలని అనుకోరు కదా. హార్దిక్‌ను ఎవ్వరూ టార్గెట్ చేయొద్దు. అది చాలా తప్పు. మీరు ఇప్పుడు ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో అతను మరో ఆరు వారాల్లో టీ20 వరల్డ్ కప్‌లో ఆడబోతున్నాడు. కాబట్టి అందరినీ ప్రోత్సహించండి. పర్సనల్ టార్గెట్స్ చేయొద్దు. అది చాలా తప్పు “” అని మండిపడ్డాడు కీరన్.