IPL 2025: కీలక మార్పులు…ధోనీ స్థానంలో రిషభ్.. ముంబైని వీడనున్న టాప్ క్రికెటర్లు
IPL 2025: 2025 IPL కోసం ఇప్పటినుంచే కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌లో మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని రిషభ్ పంత్ భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ పెర్ఫామెన్స్ చాలా దారుణంగా ఉంది. రోహిత్ శర్మను తీసి హార్దిక పాండ్యను కెప్టెన్ చేయడం పెద్ద రాంగ్ స్టెప్ అయితే.. హార్దిక్ తన పేలవ ప్రదర్శనతో ముందే రేస్ నుంచి ఔట్ అవడం మరో దెబ్బ. దాంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం టీంలో కీలక మార్పులు చేయనున్నారు. ముంబై ఇండియన్స్‌లో రోహిత్ శర్మతో పాటు సూర్య కుమార్ యాదవ్ కొనసాగడం లేదు. వీరిద్దరినీ కలకత్తా నైట్ రైడర్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.