IND vs SA: అన్న వ‌ల్ల త‌మ్ముడు ఔట్‌.. ఫీల్డ్‌లో ప‌ఠాన్ సోద‌రుల వాగ్వాదం

Irfan was visibly angry at Yusuf for the mix up and the video of the incident went viral on social media

IND vs SA:  వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్‌లో భాగంగా జులై 10న‌ టీమిండియా ఛాంపియ‌న్లు.. ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ్డారు. నార్త్‌హ్యాంప్ట‌న్ కౌంటీలో ఈ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా 210 ప‌రుగులు తీసింది. టీమిండియా 20 ఓవ‌ర్ల‌లో 156 పరుగులు తీసి 54 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. 19వ ఓవ‌ర్‌లో ప‌ఠాన్ సోద‌రులు ఇర్ఫాన్, యూస‌ఫ్‌లు బ్యాటింగ్ చేస్తున్నారు. ఇర్ఫాన్ ప‌ఠాన్ సిక్స్ కొట్ట‌గా.. ఫీల్డ‌ర్ బాల్‌ను ప‌ట్టుకోలేక‌పోయాడు. దాంతో ఇర్ఫాన్, యూస‌ఫ్ క‌లిసి ఒక ప‌రుగు తీసారు. ఆ త‌ర్వాత ఇర్ఫాన్ రెండో ప‌రుగు కూడా తీద్దాం అంటుంటే.. యూస‌ఫ్ మాత్రం వ‌ద్దు వ‌ద్దు అన్నాడు. దాంతో ఇర్ఫాన్ ఔట‌య్యాడు. దాంతో ఇర్ఫాన్ యూస‌ఫ్‌పై తీవ్రంగా మండిప‌డ్డాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.