Irfan Pathan: టీ20 నుంచి విరాట్‌ను తీసేయకండి
Irfan Pathan: టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా స్థానాన్ని దక్కించుకున్నాడు. దీనిపై ఇప్పటికే చాలా వివాదాస్పద చర్చలు జరిగాయి. ఇప్పుడు విరాట్ వల్ల టీ20 మ్యాచ్‌లో ఇండియా గెలుపుకు కావాల్సిన అంశాలు లేవని చాలా మంది నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి సెలెక్టర్ అజిత్ అగార్కర్ టీ20లో విరాట్‌ను తీసుకోకూడదు అనుకున్నారట. ఆ తర్వాత బాగా ఆలోచించి కోహ్లీకి కూడా స్థానాన్ని కల్పించారు.
అయితే.. టీ20లో విరాట్ కోహ్లీ ఎందుకు అని ప్రశ్నిస్తూ విమర్శిస్తున్నవారికి మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. విరాట్ కోహ్లీ ఇండియాకి బెస్ట్ మ్యాచ్ విన్నర్ అని.. టీంకి ఎంతో విలువ ఇస్తాడని తెలిపారు. టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాను గెలిపించేందుకు ఎక్కడో ఒక చోట విరాట్ స్కోర్‌ను చేజ్ చేస్తాడని తెలిపారు. “” సమయం వచ్చినప్పుడు టీం కోసం విరాట్ కింగ్‌గా నిలబడతాడు. నన్ను నమ్మండి. టీ20 వరల్డ్ కప్ ఆట సమయంలో ఎప్పుడో ఒక సమయంలో విరాట్ చేజ్ చేస్తాడు. 2022 టీ20 వరల్డ్ కప్ పాకిస్థాన్‌తో ఆడుతున్న సమయంలో కూడా ఇలాగే చేజ్ చేసాడు. చాలా మందికి విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై నమ్మకం ఉండదు. కానీ అతను టార్గెట్ చేజ్ చేయడాన్ని గమనించండి. అందుకే చెప్తున్నా టీ20 వరల్డ్ కప్ నుంచి విరాట్‌ను తీసేయాలని అనుకోకండి “” అని తెలిపారు