Ruturaj Gaikwad: ధోనీలా కాదు.. నాలా నేను ఆడ‌తా

Ruturaj Gaikwad: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL 2024) తొలి మ్యాచ్ మొద‌లైపోయింది. చెపాక్ స్టేడియం వేదిక‌గా డిఫెండింగ్ ఛాంపియ‌న్స్ చెన్నై సూప‌ర్ కింగ్స్.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో (CSK vs RCB) త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సంద‌ర్భంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. “” నేను కెప్టెన్ అవ్వ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. నా ఆట‌ను నేను ఆడేందుకు య‌త్నిస్తాను. ధోనీ లాగో లేదా మ‌రో ఆట‌గాడి లాగో ఆడాల‌ని అనుకోవ‌డం లేదు. ఈరోజు కాన్వే, పాతిరానాను మిస్స‌వుతున్నాం. రిచ‌న్, మిచెల్ బాగా ఆడ‌తార‌ని ఆశిస్తున్నాం. పిచ్ కూడా బాగానే ఉంద‌నిపిస్తోంది. మిస్ట‌రీ స్పిన్న‌ర్ స‌మీర్ రిజ్వి కూడా ఈరోజు తొలి మ్యాచ్ ఆడ‌బోతున్నాడు “” అని తెలిపారు.