Harshit Rana: మ‌యంక్ అగ‌ర్వాల్‌కు రానా ఫ్ల‌యింగ్ కిస్.. ఏం జ‌రిగింది?

Harshit Rana: క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ (Kolkata Knight Riders) ఫాస్ట్ బౌల‌ర్ హ‌ర్షిత్ రానా.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (Sunrisers Hyderabad) బ్యాట‌ర్ మ‌యంక్ అగ‌ర్వాల్‌కు (Mayank Agarwal) ఫ్ల‌యింగ్ కిస్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. IPL 2024 రెండో మ్యాచ్‌లో భాగంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్.. కల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ త‌ల‌ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో హ‌ర్షిత్ రానా వేసిన బంతికి మ‌యంక్ అగ‌ర్వాల్ ఔట్ అయ్యాడు. ఈ సీజ‌న్‌లో రానా తీసిన తొలి వికెట్ మ‌యంక్‌దే. ఆ ఆనందంలో మ‌యంక్ నిరుత్సాహంతో వెళ్లిపోతుండ‌గా.. రానా అత‌నికి ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చి సెండాఫ్ ఇచ్చాడు. దాంతో స్టేడియం అంతా కేక‌ల‌తో మారుమోగిపోయింది.

దీనిపై మాజీ క్రికెట‌ర్, కమెంటేట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ స్పందించారు. రానా ఇలా చేయ‌డం ఏమాత్రం బాగోలేద‌ని అన్నారు. “” రానా ఇలా చేయ‌డం ఏమాత్రం బాగోలేదు. రానా వేసిన బంతుల‌కు మ‌యంక్ సిక్సులు బాదిన‌ప్పుడు మ‌యంక్ ఇలా ప్ర‌వ‌ర్తించాడా? అలాంట‌ప్పుడు రానా ఎందుకు ఇలా చేయాలి? ఇలాంటి చిల్ల‌ర ప‌నులు చేయ‌కుండా కూడా క్రికెట్ ఆడ‌చ్చు. ఇలాంటి సెల‌బ్రేష‌న్స్ టీంతో చేసుకుంటే బాగుంటుంది. అంతేకానీ గ్రౌండ్‌పై వ‌ద్దు “” అని మండిప‌డ్డారు. హ‌ర్షిత్ ఇలా చేయ‌డం నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించ‌డ‌మే అని మేనేజ్‌మెంట్ అత‌ని ఫీజులో 60 శాతం కోత విధించింది.