Hardik Pandya బౌలింగ్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటి?

Hardik Pandya: ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య కృషి, పూజ‌లు ఫ‌లించాయి. IPL మొద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌రుస‌గా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన ముంబై ఇండియ‌న్స్ నిన్న జ‌రిగిన ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals) మ్యాచ్‌లో తొలి ఓట‌మిని సొంతం చేసుకుంది.

దాంతో హార్దిక్ ఆనందానికి అవ‌ధుల్లేవు. వ‌రుస‌గా మూడు మ్యాచ్‌లు ఓడిపోయినా ఫ్యాన్స్, యాజ‌మాన్యం త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి స‌పోర్ట్ చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్ నాలుగు ఆట‌లు ఆడింది. ఈ నాలుగు ఆట‌ల్లోని చివ‌రి రెండు మ్యాచ్‌ల‌లో హార్దిక్ అస‌లు బౌలింగ్ చేయ‌లేదు. ఇందుకు కార‌ణం ఏంటి అని అడిగితే.. ప్ర‌తీ దానికి స‌రైన స‌మ‌యం వ‌స్తుందని .. గ‌త రెండు ఆట‌ల్లో త‌న బౌలింగ్ అవ‌స‌రం అనిపించ‌లేద‌ని హార్దిక్ తెలిపారు.