“విరాట్‌ను మ‌ళ్లీ RCB కెప్టెన్ చేయండి”

Virat Kohli:  విరాట్ కోహ్లీని మ‌ళ్లీ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (Royal Challengers Banglore) కెప్టెన్‌గా చేసే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ (Harbhajan Singh). ప్ర‌స్తుతానికి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్‌గా ఫాఫ్ డు ప్లెస్సీ బాధ్య‌తలు నిర్వ‌ర్తిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కేవ‌లం రెండు మ్యాచ్‌లే గెలిచింది.

డు ప్లెస్సీ కూడా స‌రిగ్గా ఆడ‌లేక‌పోతున్నాడు. 2021లో కోహ్లీ కెప్టెన్సీ వ‌దిలేసాడు. అంతకుముందు వ‌ర‌కు కెప్టెన్‌గా బాగానే ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన కోహ్లీ.. ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా గెల‌వ‌లేక‌పోతున్నాడ‌ని వ‌స్తున్న కామెంట్స్ భ‌రించ‌లేక కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను వ‌దిలేయాల్సి వ‌చ్చింది. ఇప్పుడు కోహ్లీని మ‌ళ్లీ స్కిప్ప‌ర్‌గా ఎంపిక‌చేయాల‌ని భ‌జ్జీ రిక్వెస్ట్ చేస్తున్నారు. విరాట్‌ని మ‌ళ్లీ కెప్టెన్‌ని చేస్తే టైటిల్ గెల‌వ‌లేక‌పోతున్నా క‌నీసం ఆట‌తీరైనా బాగుంటుంద‌ని అనిపిస్తోంద‌ని భ‌జ్జీ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సీజ‌న్‌లో డు ప్లెస్సీకి విరాట్ స‌ల‌హాలు ఇస్తున్నార‌ని.. ఇక విరాట్ ఫుల్ టైం కెప్టెన్‌గా బాధ్య‌త‌లు తీసుకోవాల్సిందేన‌ని తెలిపారు.