CSK: ధోనీ గొప్పోడు కావచ్చు… ఆ నిర్ణయం మంచిది కాదు
CSK: ఎంఎస్ ధోనీ (MS Dhoni) గొప్ప క్రికెటరే కావచ్చు కానీ మొన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) జరిగిన మ్యాచ్‌లో ఆయన తీసుకున్న నిర్ణయం తప్పని అన్నారు మాజీ న్యూజిల్యాండ్ క్రికెటర్ సైమన్ డోల్ (Simon Doull). మొన్న చెన్నై సూపర్ కింగ్స్‌కి (Chennai Super Kings) ఢిల్లీ క్యాపిటల్స్‌కి మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై చిత్తుగా ఓడిపోయింది. కానీ ధోనీ మాత్రం తన బ్యాటింగ్‌తో మ్యాచ్ ఓడిపోయిన విషయాన్ని కూడా మర్చిపోయేలా చేసాడు.
దీనిపై సైమన్ స్పందిస్తూ.. సమీర్ రిజ్వి, రవీందర్ జడేజాల తర్వాత ధోనీ బ్యాటింగ్ చేయడం అనేది సరైన నిర్ణయం కాదని అన్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొదలయ్యాక ధోనీ మొన్న మ్యాచ్‌లో ఆడటం మొదలుపెట్టాడని.. ఆయన ఇంకాస్త టైం తీసుకుని సెటిల్ అయ్యుంటే బాగుండేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “” ధోనీ ఇన్సింగ్స్ విషయంలో అందరూ హర్షం వ్యక్తం చేసారు. కానీ ఆయన చాలా బంతులను బ్లాక్ చేసేసాడు. డాట్స్ ఎదుర్కొన్నాడు. రన్స్ తీసుకోవద్దు అనుకున్నప్పుడు నేను ఏం చూస్తున్నానా అని షాకయ్యాను. ధోనీ గొప్ప క్రికెటరే కావచ్చు కానీ అలా రన్స్ తీయకుండా ఆడటం చాలా తప్పుడు నిర్ణయం“” అని తెలిపారు.