Dhanashree: ధనశ్రీ.. నీకు వివాహమైంది.. ఇవేం పన్లు?
Dhanashree: ధనశ్రీ.. కొన్నేళ్ల క్రితం వరకు ఈ పేరు చెప్పగానే ఎవరబ్బా అనుకునేవారు. కానీ ఎప్పుడైతే స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయని తెలిసిందో అప్పటి నుంచి ధనశ్రీ చాలా ఫేమస్ అయిపోయింది. పెళ్లి కానంత వరకు ధనశ్రీ ఎంతో పద్ధతిగా తన డ్యాన్సులు తాను చేసుకుంటూ ఉండేది. కానీ చాహల్‌తో పెళ్లయ్యాక ఇతర స్టార్ క్రికెటర్లతో కలిసి డ్యాన్సులు చేస్తూ తన యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం వారితో కలిసి ఫోటోలు దిగడం వంటివి చేస్తుండేది. తనకు యూట్యూబ్ ఛానెల్ ఉంది కాబట్టి.. స్టార్ క్రికెటర్లతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలను పెడితే ఇంకా సబ్స్క్రైబర్లు, వ్యూస్ పెరుగుతాయి. డబ్బులు కూడా బాగానే వస్తాయి. ఇందులో తప్పేమీ లేదు. (Dhanashree)
కానీ దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఈ మధ్యకాలంలో ధనశ్రీ తనకు వివాహమైందన్న విషయాన్ని మరచి ప్రవర్తిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె దిగే ఫోటోలే చెప్తాయి. ఈరోజు ధనశ్రీ.. ముంబైకి చెందిన ప్రతీక్ ఉటేకర్ (pratik Utekar) అనే కొరియోగ్రాఫర్‌తో ఓ ఫోటో దిగింది. అందులో తప్పేముంది అనుకుంటున్నారా? ఒకసారి పైన ఉన్న ఎడమ వైపు ఫోటో చూడండి. ఎవరైనా ఒక ఫ్రెండ్‌తో ఇలా ఇంత క్లోజ్‌గా ఫోటో దిగుతారా? ఎంత స్నేహితులైనా పెళ్లయ్యాక కొన్ని హద్దులు ఉంటాయి. అవి పాటించి తీరాల్సిందే. వీరిద్దరూ ఇలా కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ధనశ్రీ.. నీకు వివాహమైంది.. ఇవేం పనులు? అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. యుజ్వేంద్ర చాహల్ ఈ ఫోటోను చూసి ఎలా ఫీలవుతున్నాడో పాపం అని ఫ్యాన్స్ సానుభూతి చూపిస్తున్నారు. భార్యపై నమ్మకంతో చాహల్ పెద్దగా పట్టించుకుని ఉండకపోవచ్చు. కానీ ధనశ్రీ దానిని అడ్వాంటేజ్‌గా తీసుకుని ఇలాంటి ఫోటోలకు పోజులిస్తూ ఉంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? సమాజంలో నెగిటివ్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అవే జనాలను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. అలాంటప్పుడు ఇలాంటి సెలబ్రిటీలు కాస్త ఆచి తూచి వ్యవహరించాలని.
అసలు ధనశ్రీ నేపథ్యం ఏంటి?
ధనశ్రీ పూర్తి పేరు ధనశ్రీ వర్మ. ఈమె ఒక డ్యాన్సర్. యూట్యూబ్‌లో తన ఛానెల్ ద్వారా డ్యాన్స్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటుంది. లాక్డౌన్ సమయంలో యుజ్వేంద్ర చాహల్ సరదాగా ఈమె డ్యాన్స్ క్లాస్‌లో చేరాడు. ఆ సమయంలోనే చాహల్ ఆమెపై మనసు పారేసుకున్నాడు. వెంటనే ఆలోచించకుండా పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేసేసాడట. అంత పేరున్న క్రికెటర్ పెళ్లి చేసుకుందామంటే ఎవరైనా ఎందుకు కాదంటారు? ధనశ్రీ కూడా ఓకే చేసేసింది. నిజానికి ధనశ్రీకి చాహల్ అంటే ఇష్టం లేదని.. అతని డబ్బుని, ఫేం చూసి పెళ్లికి ఒప్పుకుందని ఇప్పటికే ఓ నెగిటివ్ టాక్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో ధనశ్రీ ఇతర మగాళ్లతో కలిసి ఇంత చనువుగా ఫోటోలు దిగడం కరెక్ట్ అంటారా? (Dhanashree)