MS Dhoni: ధోనీ కోసం నేనెప్పుడూ ఆ రిక్వెస్ట్ చేయలేదు.. CSK యజమాని
MS Dhoni: 2025 ఐపీఎల్‌లో ఎం ఎస్ ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నియమించాలని చెన్నై సూపర్ కింగ్స్ యజమాని కాశీ విశ్వనాథన్ బీసీసీఐని కోరినట్లు ప్రచారం జరిగింది. ధోనీ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు కాబట్టి ఆయన్ను ఎక్కువ మొత్తంలో వేలంలో కొనుగోలు చేసేకంటే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నియమిస్తే ధోనీని మళ్లీ సూపర్ కింగ్స్‌లో చూడచ్చని కోరారట. దీనిపై కాశీ విశ్వనాథన్ స్పందించారు. అసలు తానెప్పుడూ ధోనీ విషయంలో బీసీసీఐని ఎలాంటి రిక్వెస్ట్ చేయలేదని అన్నారు. రూల్స్‌లో ఎలాంటి మార్పులు చేయాలన్నది బీసీసీఐ చూసుకుంటుందని.. అలాంటి మార్పులు ఏమన్నా ఉంటే బీసీసీఐ స్వయంగా ప్రకటిస్తుందని తెలిపారు. ఇక ధోనీ ఐపీఎల్‌లో ఆడటంపై స్పందిస్తూ.. దానికి ఇంకా చాలా సమయం ఉందని బీసీసీఐ ప్లేయర్ రిటెన్షన్‌పై తీసుకునే నిర్ణయాన్ని బట్టి తన నిర్ణయం ఉంటుందని అన్నారు.