KKR జట్టులో కీలక మార్పు
IPL 2024 సీజన్ నుంచి మరో ఇంగ్లండ్ పేసర్ తప్పుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) పేసర్ గస్ అట్కిన్సన్ (Gus Atkinson) అప్‌కమింగ్ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో అతని స్థానాన్ని శ్రీలంక పేసర్ దుష్మంత చమీరాతో కేకేఆర్ భర్తీ చేసింది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వహకులు ఓ ప్రకటనను విడుదల చేశారు.
‘ఐపీఎల్ 2024 సీజన్‌కు ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ దూరమవడంతో అతని స్థానాన్ని శ్రీలంక ప్లేయర్ దుష్మంత చమీరాతో (Dushmanth Chameera) KKR భర్తీ చేసింది. చమీరాకు కేకేఆర్ అతని బేస్ ప్రైజ్ రూ. 50 లక్షలు చెల్లించనుంది. స్వింగ్, సీమ్‌తో చమీరా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు.
కాగా.. చమీరాకు ఐపీఎల్ కొత్తేమీ కాదు. గతంలో అతడు 2018,2021, 2022 సీజన్లు ఆడాడు. 2018లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తరుపున, 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (Royal Challengers Banglore), 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌కు (Lucknow Super Giants) ప్రాతినిధ్యం వహించాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 12 మ్యాచులు మాత్రమే ఆడిన చమీరా 9 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 43 పరుగులు చేశాడు. 32 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ పేసర్ నిలకడగా 140 కి.మీ వేగంతో బంతులను సంధించగలడు. ఇప్పటి వరకు అతడు 52 వన్డేలు, 55 టీ20లు, 12 టెస్టుల్లో శ్రీలంక తరుపున ఆడాడు. వన్డేల్లో 56 వికెట్లు, టీ20ల్లో 55 వికెట్లు, టెస్టుల్లో 32 వికెట్లు తీశాడు.
కొద్దిరోజుల క్రితమే దుబాయ్ వేదికగా ముగిసిన IPL వేలంలో KKR.. అట్కిన్సన్‌ను కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. ఒకవేళ నెక్స్ట్ సీజన్‌లో ఆడుంటే అతడికి ఇదే తొలి ఐపీఎల్ సీజన్ అయ్యుండేది. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ టెస్టు జట్టుతో ఉన్న అట్కిన్సన్.. మూడు మ్యాచ్‌లలో ఒక్కదాంట్లో కూడా ఆడలేదు. భారత్‌తో టెస్టు సిరీస్ కారణంగా అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్ (Pakistan Super League) కూడా మిస్ అయ్యాడు.
అయితే, అట్కిన్సన్ దూరమవ్వడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) సూచనలతోనే అతను పక్కకు తప్పుకున్నట్లు బ్రిటీష్ మీడియా పేర్కొంది. అతని వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వేలంలో గస్ అట్కిన్సన్‌ను కేకేఆర్ అతని కనీస ధర కోటి రూపాయలకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2024 సీజన్ మార్చి చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం ఐపీఎల్ 2024 షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ఎన్నికల తేదీల ప్రకారం ఐపీఎల్ షెడ్యూల్‌ను రూపొందించనున్నారు. ఎన్నికలున్నా.. భారత్ వేదికగానే ఐపీఎల్ 2024 నిర్వహిస్తామని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.
ఐపీఎల్ 2024 సీజన్ కోసం కేకేఆర్ స్క్వాడ్ ఇదే
శ్రేయస్ అయ్యర్
కేఎస్ భరత్
రింకూ సింగ్
మనీష్ పాండే
రహ్మానుల్లా గుర్బాజ్
జేసన్ రాయ్
నితీష్ రాణా
ఆంగ్క్రిష్ రఘువంశీ
షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్
ఆండ్రీ రస్సెల్
వెంకటేష్ అయ్యర్
అనుకూల్ రాయ్
రమణదీప్ సింగ్
వరుణ్ చక్రవర్తి
సునీల్ నరైన్
వైభవ్ అరోరా
చేతన్ సకారియా
హర్షిత్ రాణా
సుయాష్ శర్మ
మిచెల్ స్టార్క్
దుష్మంత చమీరా
సాకిబ్ హుస్సేన్
ముజీబ్ ఉర్ రెహమాన్