Ambati Rayudu: RCB టీం కోసం ఆడ‌దు.. ఇలాంటి టీం గెల‌వ‌దు

ambati rayudu again slams rcb

Ambati Rayudu:  మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై మ‌రోసారి విమ‌ర్శ‌లు చేసారు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీంలోని ఆట‌గాళ్లు సొంత రికార్డుల కోసం మాత్ర‌మే ఆడ‌తార‌ని.. ఒక టీంగా క‌లిసి ఎప్పుడూ ఆడ‌ర‌ని అన్నారు. టీం కోసం క‌లిసి ఆడే ఆట‌గాళ్ల‌ను మేనేజ్‌మెంట్ తీసుకొస్తే త‌ప్ప బెంగ‌ళూరు టీం ఐపీఎల్ క‌ప్ కొట్టలేద‌ని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసారు.

కొన్ని రోజుల క్రితం జ‌రిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌ర్సెల్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో చెన్నైను ఓడించాక ఏదో క‌ప్ గెలిచేసిన‌ట్లు బెంగ‌ళూరు ఆట‌గాళ్లు మైదానంలో సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నార‌ని రాయుడు విమ‌ర్శించారు. చెన్నైపై గెలిచేస్తే క‌ప్ గెలిచేసిన‌ట్లే అని ఫీలైపోతున్నార‌ని ఆయ‌న మండిపడ్డారు.