Abhishek sharma: నాన్న స‌ల‌హా సిక్స‌ర్ కింగ్‌ని చేసింది

Abhishek sharma reveals his father's best advice

Abhishek sharma: T20I మ్యాచ్‌లో త‌న స‌త్తాను మ‌రోసారి నిరూపించాడు అభిషేక్ శ‌ర్మ‌. ఇప్పుడు అభిషేక్‌ను అంద‌రూ సిక్స‌ర్ కింగ్ అంటున్నాడు. త‌న‌కు ఎన్ని బిరుదులు ఇచ్చినా అవ‌న్నీ త‌న తండ్రికే ద‌క్కాల‌ని అంటున్నాడు అభిషేక్‌. ఎందుకంటే త‌న తండ్రి ఇచ్చిన స‌ల‌హాలే త‌న‌కు సిక్స‌ర్ కింగ్‌ని చేసాయ‌ని చెప్తున్నాడు ఈ యువ కెర‌టం.

నిన్న హ‌రారేలో ఇండియాకు జింబాబ్వే మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో అభిషేక్ 47 బంతుల్లో సెంచ‌రీ బాదాడు. 11వ ఓవ‌ర్‌లోనే అర్థ సెంచ‌రీ బాది ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఆరు సిక్సుల‌తో స్కోర్‌ను 82 నుంచి 100కు తీసుకుపోయాడు. దాంతో అభిషేక్‌ని అంతా సిక్స‌ర్ కింగ్ అంటున్నారు. అయితే ఇలా సిక్స‌ర్ కింగ్ అని పిలిపించుకోవ‌డానికి కార‌ణం త‌న తండ్రే అని ఎందుకంటే బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఎక్కువ‌గా లోఫ్టెడ్ షాట్స్ కొట్టాల‌ని త‌న తండ్రే చెప్పార‌ని తెలిపాడు. చాలా మంది కోచ్‌లు లోఫ్టెడ్ షాట్స్ కొట్టొద్ద‌ని చెప్తార‌ని కానీ తండ్రి ఈ షాట్స్ కొట్టాల‌ని చెప్తుంటాడ‌ని అందుకే అవే బాదాన‌ని పేర్కొన్నాడు. లోఫ్టెడ్ షాట్ అంటే బంతిని ఎక్కువ‌గా గాల్లోకి కొట్ట‌డం. దీని వ‌ల్ల ఫీల్డ‌ర్లు బంతికి అందులోక‌పోతారు.