గుమ్మడికాయను ఆడవాళ్లు ఎందుకు కట్ చేయకూడదు?
మీరు ఎప్పుడైనా గమనించారా? ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగినప్పుడు గుమ్మడికాయను (pumpkin) మగవారి చేతే పగలగొట్టించడం.. కట్ చేయించడం వంటివి చేస్తుంటారు. అలా ఎందుకు చేస్తారో దాని వెనకున్న కథేంటో తెలుసుకుందాం. (spiritual)
మన భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో గుమ్మడికాయను ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అందుకే ఆడవారి చేత గుమ్మడికాయను పగలగొట్టించడం కట్ చేయించడం వంటివి చేయరు. ఇప్పుడు రోజులు తరాలు మారుతున్న నేపథ్యంలో ఈ నమ్మకాలను కూడా ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. కానీ ఛత్తీస్‌గడ్‌లోని ఓ గిరిజన ప్రాంతంలో ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఇక మన సనాతన ధర్మం ప్రకారం.. మహిళ అంటే దేనినైనా సృష్టించేది కానీ వినాశనానికి ప్రతీక కాదు అని అంటుంటారు. అందుకే గుమ్మడికాయను ఆడవారి చేత కట్ చేయించడం పగలగొట్టించడం వంటివి చేయించరు. (pumpkin)