కాకుల‌కు ఎందుకు ఆహారం పెట్టాలి?

కాకులు అరుస్తుంటే అది అశుభం అంటుంటారు. కాకి గోల (crow)  అని తిట్టుకుంటూ ఉంటారు. కానీ కాకికి తిండి పెడితే ఎంతో పుణ్యం (spiritual). కాకికి ఆహారం పెట్ట‌డం అంటే పూర్వీకుల‌కు పెట్టిన‌ట్లే అని భావిస్తారు.

కాకులు మ‌న‌కు మ‌న పూర్వీకుల‌కు మ‌ధ్య మెసెంజ‌ర్ల‌లా వ్య‌వ‌హరిస్తాయ‌ట‌. మ‌నం వాటికి ఆహారం పెడితే అవి మ‌న పూర్వీకుల‌కు మోసుకెళ్తాయ‌ని పెద్ద‌లు అంటుంటాయి. చ‌నిపోయిన‌వారు భౌతికంగా దూరం అయిన‌ప్ప‌టికీ ఇలా కాకుల రూపంలో మ‌న మ‌ధ్యే ఉంటార‌ట‌. వాటికి హాని త‌ల‌పెట్ట‌కుండా వీలైతే నీరు, ఆహారం పెడితే ఎంతో పుణ్యం.

మ‌నం చేసే ప్రతి ప‌నికి క‌ర్మ ఫ‌లితం అనేది ఉంటుంది. అది మంచైనా చెడైనా. కాకుల‌కు ఆహారం పెట్ట‌డం వ‌ల్ల మ‌నం చేసిన పాపాల‌కు క‌ర్మ‌ఫ‌లం కాస్త తగ్గుతుంద‌ట‌. శ‌నిదేవుడి వాహ‌నం కాకి. శ‌నిగాడు.. శ‌ని ప‌ట్టుకుంది అంటుంటాం కానీ నిజానికి శ‌నిదేవుడు మ‌న‌కు మంచే చేస్తాడు. కాకుల‌కు ఆహారం పెడితే శ‌నిదేవుడి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే కొన్ని అశుభాలు కూడా త‌గ్గుతాయి. అమావాస్య రోజున‌.. ఎవ‌రికైనా శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించే రోజున కాకుల‌కు ఆహారం పెడితే ఎంతో మంచిది. రాహు మ‌హా ద‌శ స‌మ‌యంలో కాకుల‌కు ఆహారం పెడితే రాహు దోషం తొల‌గిపోతుంది. (spiritual)