ధ‌న త్రయోద‌శి నాడు ఏ స‌మ‌యంలో బంగారం కొనాలి?

Diwali: ధ‌న త్ర‌యోద‌శి (dhanteras) నాడు బంగారం కొంటే ఎంతో మంచిది. అయితే ఏ స‌మ‌యంలో కొంటున్నాము అనేది చూసుకోవ‌డం కూడా ఎంతో ముఖ్యం. ఈసారి ధ‌న త్ర‌యోద‌శి న‌వంబ‌ర్ 10న వ‌చ్చింది. మ‌రి ఏ స‌మ‌యంలో బంగారం కొంటే మంచిదో తెలుసుకుందాం.

ధ‌న త్ర‌యోద‌శి నాడు మ‌ధ్యాహ్నం 12:35 గంట‌ల స‌మ‌యంలో కొనాలి. అంటే న‌వంబర్ 10న మ‌ధ్యాహ్నం 12:35 గంట‌ల నుంచి న‌వంబ‌ర్ 11న మ‌ధ్యాహ్నం 1:57 వ‌ర‌కు ఎప్పుడైనా కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఎవ‌రిని పూజించాలి?

ఇక ధ‌న త్ర‌యోద‌శి నాడు కుబేరుడు, ల‌క్ష్మీదేవికి త‌ప్ప‌క పూజించాలి. ఎందుకంటే అపార‌మైన డ‌బ్బును ప్ర‌సాదించే వీరే కాబ‌ట్టి.

య‌మ‌దీప్దా

ధ‌న త్ర‌యోద‌శిని య‌మ‌దీప్దా అని కూడా అంటారు. ఇలా అన‌డం వెనుక ఓ క‌థ ఉంది. హిమ అనే రాజు కొడుక్కి పెళ్లి జ‌రిగిన నాలుగో రోజే పాము కాటుకు బ‌లైపోతాడ‌ని ఓ జ్యోతిష్యుడు చెప్తాడు. ఈ విష‌యం యువ‌రాజు భార్య‌కు తెలుస్తుంది. దాంతో త‌న భ‌ర్త‌కు ఏమీ కాకూడ‌ద‌ని త‌న నివాసాన్ని దీపాల‌తో అలంక‌రించి గుమ్మం ఎదుట బంగారం, వెండి ఆభ‌ర‌ణాల‌ను ఉంచుతుంది. రాత్రంతా త‌న భ‌ర్త‌కు ఏమీ కాకూడ‌ద‌ని య‌ముడికి సంబంధించిన స్తోత్రాలు, పాట‌లు పాడుతూ కూర్చుంటుంది. ఆ స‌మ‌యంలో య‌ముడు రాకుమారుడిని తీసుకెళ్ల‌డానికి వ‌స్తాడు. కానీ దీప కాంతులు, వెండి, బంగారు ఆభ‌ర‌ణాల వెలుగుల వ‌ల్ల యుముడి క‌ళ్లు చెదిరిపోతాయి. త‌న భ‌ర్త కోసం ఆ ఇల్లాలు ప‌డే త‌ప‌న‌.. త‌న కోసం పాడుతున్న పాట‌ల‌ను వింటూ య‌ముడు రాకుమారుడిని వెంట తీసుకెళ్ల‌కుండానే అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. అందుకే ధ‌న త్ర‌యోద‌శిని య‌మ‌దీప్దా అని కూడా అంటారు.