Vastu: వాస్తు ప్ర‌కారం ప్రేమికులు ఎలాంటి కానుక‌లు ఇచ్చిపుచ్చుకోవాలి?

Vastu: వాస్తుశాస్త్రం అనేది కేవ‌లం ఇళ్లు నిర్మించుకోవ‌డానికే కాదు.. కానుక‌లు ఇచ్చుకోవ‌డంలోనూ సాయ‌ప‌డుతుంది. ఎలాంటి కానుక‌లు ఇస్తే ప్రేమ దృఢ‌ప‌డుతుందో.. ఏవి ఇవ్వ‌కూడ‌దో కూడా వాస్తు శాస్త్రంలో రాసుంది.

*ఇద్ద‌రు ప్రేమికుల మ‌ధ్య అర్థంచేసుకునే గుణం, ప్రేమ మ‌రింత పెర‌గాలంటే రెండు పావురాలు జంట‌గా ఉన్న కానుక‌ను ఇచ్చి చూడండి. ఈ కానుక‌ను అబ్బాయిలే ఇవ్వాలనేం లేదు అమ్మాయిలు కూడా ఇవ్వ‌చ్చు. కాక‌పోతే ఆ పావురాల కానుక‌గా ఇంట్లోని నైరుతి దిక్కున పెట్టండి.

*బుద్ధుడు క‌డుపుబ్బా న‌వ్వుతున్న కానుక‌ను కూడా ఇవ్వ‌చ్చు. ఈ కానుక ప్ర‌శాంత‌తను క‌లిగించి.. మాన‌సికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది.

*గోల్డెన్ రంగులో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇవ్వ‌చ్చు. అది కూడా దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి. ఈ కానుక ప్రేమికుల మ‌ధ్య స్థిర‌త్వాన్ని పెంపొదిస్తుంది.

*రోజ్ క్వార్ట్జ్ అనే రాయి కూడా ఎంతో మంచిది. రోజ్ క్వార్ట్జ్ అనే రాయి ప్రేమ‌కు చిహ్నం. దీని నుంచి వ‌చ్చే వైబ్రేష‌న్స్ వ‌ల్ల ప్రేమికుల మ‌ధ్య అనుబంధం మ‌రింత దృఢ‌ప‌డుతుంద‌ట‌.

*ప్రేమ‌కు ప్ర‌తీక అయిన రాధాకృష్ణుల బొమ్మ‌ను మించిన కానుక మ‌రొక‌టి లేద‌నే చెప్పాలి. రాధాకృష్ణుల బొమ్మ కానీ ఫోటో కానీ కానుక‌గా ఇస్తే ఎంతో మంచిది.