Kartika Masam: మాం పాహి..!
శివయ్యకు ఎంతో ప్రీతికరమైన కార్తిక మాసం (kartika masam) ఇంకొన్ని రోజుల్లో మొదలవబోతోంది. సాధారణంగా దీపావళి తర్వాత నుంచి కార్తిక మాసం మొదలవుతుంది. కార్తిక మాసంలో చేయాల్సినవి చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం.
*శివయ్యను ఎక్కువగా ఈ మాసంలో ఆరాధిస్తుంటారు. ముఖ్యంగా కార్తిక సోమవారాలు ఎంతో మంచిది. ప్రతి సోమవారం శివయ్య ఆలయానికి వెళ్లి అక్కడ మర్రి, వేప చెట్ల కింద దీపం పెడితే ఎంతో పుణ్యం.
*కార్తిక మాసం సమయంలో నదుల్లో పుణ్య స్నానాలు ఎక్కువగా చేస్తుంటారు. ఒకవేళ మీరు నదుల్లో స్నానం చేస్తున్నట్లైతే ఉమ్మడాలు, మూత్రం పోయడాలు వంటివి చేయకండి. (kartika masam)
*మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఉల్లి, వెల్లుల్లి, వంకాయ, గుమ్మడి తినకూడదు.
*రోజూ సాయంత్రం వేళల్లో తులసి కోట దగ్గర ముగ్గు వేసి దీపం పెట్టండి.
*రోజూ నెయ్యితో దీపం వెలిగించి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎంతో మంచిది. (kartika masam)
*కార్తిక పౌర్ణమి కోసం మాత్రం ఉసిరి దీపాలు వెలిగించండి.
*కార్తిక మాసం అంతా నిష్ఠగా ఉంటూ శివ నామం జపిస్తుంటే మీ జననేంద్రియాలు మీ ఆధీనంలో ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
*ఇంట్లో ఎవ్వరినీ ఏమీ అనకండి. శాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.