ఈ పనులు చేస్తే లక్ష్మీదేవికి మహా కోపం
ఇంట్లో లక్ష్మీదేవి (lakshmi devi) తాండవించాలంటే మనం చేయాల్సిన కొన్ని పనులు చేయకూడని పనులు ఉంటాయి. వాటిని తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. లేదంటే లక్ష్మీదేవి అనుగ్రహం అటుంచితే.. ఆగ్రహానికి గురవుతాం. ఇంతకీ అమ్మవారికి కోపం తెప్పించే పనులు ఏంటో తెలుసా?
కోపం
ఇంట్లో ఎవ్వరిపై కోపగించుకోకండి. ఏ ఇంట్లో అయితే కోపం, దాని వల్ల వచ్చే అసభ్యకర మాటల వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఎక్కడైతే ప్రశాంతత, సంతోషం ఉంటాయో లక్ష్మీదేవి అక్కడ ఉండేందుకే ఇష్టపడుతుంది.
అపరిశుభ్రత
ఇల్లు దరిద్రంగా అపరిశుభ్రంగా ఉంటే లక్ష్మీ దేవి కాలు కూడా పెట్టదు. రోజూ ఇంట్లోని బూజును దుమ్మును ఎప్పటికప్పుడు దులిపేసుకుని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. (lakshmi devi)
శుభ్రంగా లేని దుస్తులు
ఇంట్లో ఉన్నా వీధిలోకి వెళ్లినా మంచి దుస్తులు ధరించాలి. ఇంట్లోనే కదా ఉన్నాం అని మరకగా ఉన్నవి, చిరిగిన దుస్తులను ధరించకూడదు.
బ్రహ్మముహూర్తంలో శృంగారం
తెల్లవారుజామున ఉదయం 2 నుంచి 4 గంటల సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ సమయంలో తెలిసో తెలీకో శృంగారంలో పాల్గొంటే అరిష్టం.
నిద్ర
సూర్యోదయానికి ముందు లేవాలి అంటారు. అదే విధంగా సూర్యాస్తమయ సమయంలో నిద్రపోకూడదు అని కూడా చెప్తుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న వివిధ రకాల ఉద్యోగాలు పనివేళల కారణంగా ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నాం. కానీ మిగతా పనులు మాత్రం చేయకుండా ఉంటే మంచిది కదా..! (lakshmi devi)